BREAKING
బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు డేంజర్ జోన్ ఇళ్ల జాబితా పై భూ నిర్వాసితుల ఆందోళన-846 ఇళ్ల గుర్తింపు పై గ్రామ సభలో అభ్యంతరాలు-18 ఏళ్లు నిండిన పిల్లలకు ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ వైభవంగా సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం

వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు

Select Suryaa Now
వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు

 

 *ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,* గోనెగండ్ల, నందవరం మండలాల్లో వైసీపీ ని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో చిన్న కొత్తిలి, పెసలదిన్నె, పుట్టపాశం గ్రామాలకు చెందిన పలువురు కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. చిన్న కొత్తిలి గ్రామానికి చెందిన కె. నాగేష్, రాజు, రాముడు, చిన్న నరసప్ప, టైలర్ రాజు, పుట్టపాశం గ్రామానికి చెందిన బీటీ లలితమ్మ, తిమ్మగురుడు, పెసలదిన్నె గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు గౌస్, అబ్దుల్లా, మహబూబ్ బాషా, అల్లామియా, మాబుసాబ్, బడేసాబ్ తదితరులు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నమ్మకమే తెలుగుదేశం పార్టీ బలమని, అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 *A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*