BREAKING
బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు డేంజర్ జోన్ ఇళ్ల జాబితా పై భూ నిర్వాసితుల ఆందోళన-846 ఇళ్ల గుర్తింపు పై గ్రామ సభలో అభ్యంతరాలు-18 ఏళ్లు నిండిన పిల్లలకు ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ వైభవంగా సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం

డేంజర్ జోన్ ఇళ్ల జాబితా పై భూ నిర్వాసితుల ఆందోళన-846 ఇళ్ల గుర్తింపు పై గ్రామ సభలో అభ్యంతరాలు-18 ఏళ్లు నిండిన పిల్లలకు ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్

Select Suryaa Now
డేంజర్ జోన్ ఇళ్ల జాబితా పై భూ నిర్వాసితుల ఆందోళన-846 ఇళ్ల గుర్తింపు పై గ్రామ సభలో అభ్యంతరాలు-18 ఏళ్లు నిండిన పిల్లలకు ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్

మల్హర్, మేజర్ న్యూస్, మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసీపీకి 500 మీటర్ల పరిధిలోని గృహాల సేకరణపై సోమవారం తాడిచర్ల పాత బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో భూ నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, జెన్కో సీఈవో ప్రకాష్, తహశీల్దార్ రవికుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.2022 డిసెంబర్‌లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ (పీఎన్)లో 2,265 ఇళ్ల వివరాలను ప్రచురించగా, అనంతరం సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు వాటిలో 1,203 ఇళ్లను అనుమతులతో కూడినవిగా (విత్ పర్మిషన్), గా ప్రకటించి 1,062 ఇళ్లను అనుమతులు లేనివిగా (వితౌట్ పర్మిషన్) గా రెవెన్యూ అధికారులు గుర్తించారు. అనంతరం నిర్వహించిన సర్వేలో నివాసయోగ్యమైన, నివాసానికి అనుకూలంగా లేని గృహాలను వేర్వేరుగా పరిశీలించి, 1,203 అనుమతులున్న ఇండ్ల నుంచి కేవలం 846 ఇళ్లనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అర్హతకు గుర్తిస్తూ జాబితాలు ప్రచురించడంపై గ్రామసభలో నిర్వాసితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.2008లో ఏపీ జెన్కో పేరిట ఇళ్లకు సీరియల్ నంబర్లు వేసి గుర్తించినప్పటి నుంచి దాదాపు 18 సంవత్సరాలు గడిచిందని, ఈ కాలంలో జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఏ ప్రాతిపదికన ఇళ్ల సంఖ్యను 1203 నుంచి 846 వరకు చూపించారని అంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ (నేషనల్ హ్యూమన్ రైట్స్) తరఫున భూ నిర్వాసితుడు బండి సుధాకర్ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్‌ను తీవ్రంగా ప్రశ్నించారు.ఈ సందర్భంగా భూ నిర్వాసితుడు ఇందరపు మహేందర్ మాట్లాడుతూ.. విత్ పర్మిషన్, వితౌట్ పర్మిషన్ అనే తేడా లేకుండా స్థానికులైన నిర్వాసితులందరినీ గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను నమోదు కోసం గతంలో పంచాయతీ కార్యదర్శి రూ.300కు ఇచ్చే పన్నును రూ.20 వేలు డిమాండ్ చేయడంతో అనేకమంది పేదలు ఆ మొత్తం చెల్లించలేక ఇళ్లను గ్రామపంచాయతీలో నమోదు చేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పన్ను నమోదు కాలేదనే కారణంతో స్థానికులను అర్హతకు దూరం చేయకుండా, ప్రతి నిర్వాసితుడిని గుర్తించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పించే దిశగా అధికారులు ఆలోచించాలని కోరారు. ప్రజల తరఫున ఆలోచించి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్, బండి సర్పంచ్ బండి స్వామి మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో 18 సంవత్సరాలు నిండిన ఆడ, మగ పిల్లలకు కటాఫ్ తేదీని కేవలం చట్టపరమైన కోణంలో కాకుండా మానవీయ కోణంలో పరిశీలించాలని కోరారు. నాలుగేళ్లపాటు కటాఫ్ తేదీని పొడిగించి 2026 మార్చి వరకు పరిగణనలోకి తీసుకోవాలని, అప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఇండ్లు కోల్పోయిన ప్రతి నిర్వాసితునికి వన్ టైం సెటిల్మెంట్ కాకుండా ప్రతి ఒక్క అర్హులైన వారికి పునరావాస స్థలం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. అనుమతులు లేని 1,062 ఇళ్ల పరిస్థితిపై ప్రశ్నించిన నిర్వాసితులకు స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో బాధితులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాబితాలో పేర్లు రాని వారు దరఖాస్తు చేసుకునేందుకు డేంజర్ జోన్ బస్టాండ్ వద్ద ఒక కౌంటర్, తహశీల్దార్ కార్యాలయంలో మరో కౌంటర్ ఏర్పాటు చేసి వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామని తహశీల్దార్ రవికుమార్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సర్పంచ్ బండి స్వామి, ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్, తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మోండయ్య, జెన్కో సీఈవో ప్రకాష్, రెవెన్యూ అధికారులు, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;ప్రభాకర్ ,మలహర్, జయశంకర్ జిల్లా భూపాలపల్లి