BREAKING
దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు డేంజర్ జోన్ ఇళ్ల జాబితా పై భూ నిర్వాసితుల ఆందోళన-846 ఇళ్ల గుర్తింపు పై గ్రామ సభలో అభ్యంతరాలు-18 ఏళ్లు నిండిన పిల్లలకు ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ వైభవంగా సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం ఆదర్శంగా నిలుస్తున్న మ్యాంగో స్ట్రీట్ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీను ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి

టేబుల్ టెన్నిస్ లో చిన్నమడూరు విద్యార్థుల సత్తా

Select Suryaa Now
టేబుల్ టెన్నిస్ లో చిన్నమడూరు విద్యార్థుల సత్తా

దేవరుప్పుల, మేజర్ న్యూస్, జిల్లా కలెక్టర్ కప్–2026 ఇండోర్ గేమ్స్ పోటీల్లో దేవరుప్పుల మండలంలోని చిన్నమడూరు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల కీర్తిని చాటారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో జూనియర్ విభాగంలో ఎస్. ప్రదీప్ ప్రథమ స్థానం సాధించగా, సీనియర్ విభాగంలో ఎన్. హరీష్ తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జూనియర్ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన ప్రదీప్‌కు రూ.10 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ, ప్రశంసాపత్రం లభించాయి. సీనియర్ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచిన హరీష్‌కు రూ.4 వేల నగదు బహుమతి, ట్రోఫీ, ప్రశంసాపత్రం అందజేశారు. ఇదే పాఠశాల నుంచి బాలికలు జి. స్పందన, శృతిక కూడా జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం ఆనందంగా ఉంది: విజేతలు ప్రదీప్, హరీష్ మాట్లాడుతూ మండల స్థాయి పోటీల్లో విజయం సాధించి జిల్లా స్థాయిలోనూ ప్రతిభ చాటడం తమలో మరింత పట్టుదలను పెంచిందన్నారు. టేబుల్ టెన్నిస్‌లో మరింత సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారికి మార్గదర్శకత్వం వహించిన గణిత ఉపాధ్యాయుడు పి. ప్రవీణ్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డా. జి. కళావతి అభినందించారు. ఈ విజయం విద్యార్థుల కృషితో పాటు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహానికి కూడా నిదర్శనమని పేర్కొన్నారు. విజేతలను స్ఫూర్తిగా తీసుకుని పాఠశాలలోని ఇతర విద్యార్థులు సైతం తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నిరంతర సాధనతో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి. రాజనారాయణ, ఎ. వరలక్ష్మి, ఐ. అరుణోదయ కుమారి, డి. నళిని, బి. రజనీకాంత్, సరిత ఆర్., డి. అంజిరెడ్డి, బి. రాజమణి, డి. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; ఎల్లేష్, దేవరుప్పుల ,జనగామ జిల్లా