BREAKING
ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీను ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి ఎన్నికల విధులకు ఆన్‌లైన్ రాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల టేబుల్ టెన్నిస్ లో చిన్నమడూరు విద్యార్థుల సత్తా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు

తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ

Select Suryaa Now
తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ
సూర్య తిర్యాణిి: పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తిర్యాణి మండలంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర కార్తీక స్నానాలు ఆచరించి, దేవాలయాలను సందర్శించారు. భక్తిశ్రద్ధలతో ఉసిరి దీపాలు వెలిగించి, 365 వత్తులతో దీపారాధన నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ గణపతి–మల్లికార్జున స్వామి దేవాలయంలో అర్చకులు పాలకిల అజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలోని శివలింగానికి వేదమంత్రోచ్చారణల మధ్య రుద్రాభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.అదేవిధంగా మల్లికార్జున స్వామి ఆలయంలో కాపు సంఘం ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారులతో మల్లన్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేసి భక్తులు తమ మొక్కులు సమర్పించుకున్నారు. ఒగ్గు కళాకారుల సంప్రదాయ పూజా విధానాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.భీమారం హనుమాన్ మందిరంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దంపతులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కథను శ్రద్ధగా ఆలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.ఆలయాల్లో వెలిగించిన దీపాల కాంతులు, మంత్రోచ్చారణలు, భక్తుల శివనామస్మరణతో తిర్యాణి మండలమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్తీక పౌర్ణమి వేడుకలతో ప్రజలు భక్తిపారవశ్యంలో మునిగిపోగా, మండలం కార్తీక శోభతో కళకళలాడింది.