ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీను
ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీనివాసరావు.
సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు గ్రామ సర్పంచిగా సోమేపల్లి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థులుగా ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు. నలుగురు నామినేషన్లను మంగళవారం విత్ డ్రా చేసుకున్నారు. దీంతో సోమేపల్లి శ్రీను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికయ్యారు. ఆయన గతంలో మండల టిడిపి అధ్యక్షులుగా 6 సార్లు పని చేశారు. సర్పంచిగా ఎన్నికైన శ్రీనివాసరావును టిడిపి నాయకులు ,కార్యకర్తలు, గ్రామస్తులు అభినందించారు.