BREAKING
బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై అసత్య ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు డేంజర్ జోన్ ఇళ్ల జాబితా పై భూ నిర్వాసితుల ఆందోళన-846 ఇళ్ల గుర్తింపు పై గ్రామ సభలో అభ్యంతరాలు-18 ఏళ్లు నిండిన పిల్లలకు ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ వైభవంగా సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం

తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

Select Suryaa Now
తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

*నీటి వృథా లేకుండా పైప్‌లైన్ లీకేజీలను తక్షణమే అరికట్టాలి.

*కమిషనర్ ఎం.జయకృష్ణ.


తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ఆదేశించారు. అలిపిరి సమీపంలోని కళ్యాణి ఫిల్టర్ హౌస్, జూ పార్క్ మార్గంలో నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. 
నగరంలోని అన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పైప్‌లైన్ల ద్వారా నీరు వృథాగా పోకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరాయంగా, సక్రమంగా త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్య పనులను పరిశీలించి, మరింత మెరుగ్గా పనులు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. కమిషనర్ వెంట నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది  ఉన్నారు.

Raaju బ్యూరో,తిరుపతి జిల్లా