telangana
డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి
సూర్య జైనూర్: ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కులు, అస్తిత్వం, రిజర్వేషన్ల పరిరక్షణే లక్ష్యంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో డిసెంబర్ 9న నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని డబోలి రాయి సెంటర్ సార్మెడి కుంరా దుందే రావు పిలుపునిచ్చారు.జైనూర్ మండలం భూసిమెట్ట గ్రామంలో రాయి సెంటర్ పరిధిలోని గ్రామాల్లో నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుంరా దుందే రావు మాట్లాడుతూ జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మూడు మండలాల నుంచి ఆదివాసీలు, యువతీ యువకులు, మేధావులు, ప్రజలు భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు తరలిరావాలని కోరారు.ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు జల్, జంగల్, జమీన్ హక్కులు, విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఆదివాసీ గూడెం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విల్లంబులతో ఆదివాసీ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డబోలి రాయి సెంటర్ సార్మెడి కుంరా దుందే రావు, డబోలి మాజీ సర్పంచ్, ఆదివాసీ నాయకులు నగోరావు, మారు, అర్జున్, జ్యోతిరాం, మక్కు తదితరులు పాల్గొన్నారు.