BREAKING
పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాదానికి ఆహ్వానం! మార్పు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత.. భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం

మార్పు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్

Select Suryaa Now
మార్పు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్

గుంటూరు : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల రూపురేఖలను మార్చి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘మార్పు’ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ‘మార్పు’ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోవు డిసెంబర్ చివరి నాటికి హాస్టళ్ల ఆధునికీకరణ పనులకు సంబంధించి అవసరమైన అన్ని ఆర్థికపరమైన అనుమతులు పొందాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి జిల్లాలో గుర్తించిన సంక్షేమ హాస్టళ్లలో ఆధునిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, సోక్ పిట్స్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. వ్యర్థ జలాల నిర్వహణ, ఘన వ్యర్థాల సక్రమ పారవేతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పచ్చదనం పెంపులో భాగంగా హాస్టళ్ల ప్రాంగణాల్లో హెర్బల్ గార్డెన్స్, దోమల నివారణకు ఉపయోగపడే మస్కిటో రిపెల్లెంట్ గార్డెన్స్ ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాటు చేసిన గార్డెన్స్ నిరంతరం నిర్వహణలో ఉండేలా వెంటనే మంచినీటి ట్యాప్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.‘మార్పు’ పథకం లక్ష్యాలకు అనుగుణంగా అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో సీపీఓ లక్ష్మి కుమారి, డ్వామా పీడీ శంకర్, పంచాయతీరాజ్ , ఆర్ అండ్ బి ఎస్ ఈ లు అశోక్, శ్రీనివాసమూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హరిత, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి దుర్గాభాయి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి మయూరి తదితరులు పాల్గొన్నారు.