BREAKING
పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాదానికి ఆహ్వానం! మార్పు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత.. భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం

తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత..

Select Suryaa Now
తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత..
చెన్నై/మధురై, నవంబర్ 24: తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగింపు వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్‌ను తిరునెల్వేలిలోని ఆయన నివాసంలోనే గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు.

వివాదాస్పదంగా మారిన కొండపై భాగంలోని 'దీపతూణ్' (రాతి స్తంభం) వద్ద ఇవాళ (నవంబర్ 24) కార్తీక దీపం వెలిగించేందుకు ఆలయ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన పరిమిత బృందానికి సుప్రీంకోర్టు ఇటీవల (నవంబర్ 20న) తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపం వెలిగింపు ప్రక్రియను పరిశీలించేందుకు మధురై వెళ్లాలని నయినార్ నాగేంద్రన్ నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన మధురై వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, హిందూ మున్నాని సభ్యులను పోలీసులు ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు.

మరోవైపు, సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలపై తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుప్పరంకుండ్రం కొండ మరియు మధురై పరిసరాల్లో సుమారు 5,600 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ (బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163) కింద ఆంక్షలు విధించారు.