BREAKING
ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీను ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి ఎన్నికల విధులకు ఆన్‌లైన్ రాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల టేబుల్ టెన్నిస్ లో చిన్నమడూరు విద్యార్థుల సత్తా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

Select Suryaa Now
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

గుంటూరు : మంగళగిరి కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సి యం సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన పలు సూచనలు చేశారు.పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాల కవరేజీ ఏర్పాటు చేయాలని సూచించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అదనపు టేబుళ్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.గత జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసినప్పటికీ గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమర్థవంతంగా విధులు నిర్వహించారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్నారు. గుంటూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మాట్లాడుతూ మంగళగిరి కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్, కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో అదనపు టేబుళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు.

 

 

సూర్య నాయక్