BREAKING
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి సూర్యవంశీ సిక్సర్ల సునామీ.. డాక్టర్ తలారి రంగయ్య పై ప్రచారాలు తగవు... సిబిఐ విచారణకు సిద్ధమా? దహెగాంలో రావుల మల్లన్న భక్తుల పవిత్ర గంగా స్నానాలు టీడీపీకి బీజేపీ బిగ్ షాక్..! -కూటమిలో కుదరని పొత్తులు..!! మండపం బరిలో ముగ్గురు లక్ష్మీలు...!!! అపస్మా నూతన కార్యవర్గ ఎంపిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏకగ్రీవ సర్పంచ్. కార్మిక హక్కుల రక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి యు ఆధ్వర్యంలో ర్యాలీ ఓటు హక్కు వినియోగించుకోండి వైసీపిని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు డేంజర్ జోన్ ఇళ్ల జాబితా పై భూ నిర్వాసితుల ఆందోళన-846 ఇళ్ల గుర్తింపు పై గ్రామ సభలో అభ్యంతరాలు-18 ఏళ్లు నిండిన పిల్లలకు ప్యాకేజీ వర్తింప చేయాలని డిమాండ్ వైభవంగా సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం ఆదర్శంగా నిలుస్తున్న మ్యాంగో స్ట్రీట్ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి

Select Suryaa Now
ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి

గుంటూరు : ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు అజెండా - ప్రతి గల్లికి ఒక గూండాను తయారు చేయడమే జగన్ అజెండా అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. మంగళవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం మాత్రమే కాదని, ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా, ఆర్థికంగా బలోపేతమై, సంతోషంగా జీవించాలన్నదే ఆయన ఆలోచన అని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి అండగా నిలుస్తోందన్నారు. నందమూరి తారక రామారావు ప్రారంభించిన పెన్షన్ విధానాన్ని చంద్రబాబు నాయుడు మరింత బలోపేతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించేలా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో విడతలవారీగా కేవలం రూ.250 చొప్పున పెంచుతూ వచ్చిందని, ఎన్నికల ముందు మాత్రమే రూ.3,000 పెన్షన్ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య, వితంతు తదితర సాధారణ సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4,000కు పెంచి నిజమైన సంక్షేమం అంటే ఏమిటో నిరూపించిందన్నారు.  ఒంటరి మహిళలకు, వితంతువులకు రూ.6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15,000, దివ్యాంగులకు రూ.10,000 వరకు పెన్షన్లు అందిస్తూ వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలసేమియా బాధితులు, పక్షవాతంతో బాధపడుతున్న వారు, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలతో జీవిస్తున్న వారికి వారి పరిస్థితులకు అనుగుణంగా పెన్షన్లు అందించడం కూటమి ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమన్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు కూడా ప్రత్యేకంగా పెన్షన్లు అందిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కోసం రానున్న ఐదేళ్లలో సుమారు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆర్థిక భారాన్ని లెక్కచేయకుండా పేదల సంక్షేమానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లను పెంచడం చంద్రబాబు నాయుడు నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ఒకటో తేదీ సెలవు దినమైతే ముందురోజే పంపిణీ చేపడుతోందన్నారు. సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించడం ద్వారా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తోందని తెలిపారు. ఇది కేవలం నగదు పంపిణీ కాదని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కల్పిస్తున్న ఆత్మగౌరవం, భరోసా అని అన్నారు.గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షలు, వివక్షతో అర్హులైన వారికి సైతం పెన్షన్లు తొలగించిన సందర్భాలు ఉన్నాయని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. అవసరంలో ఉన్న పేదలకు మాత్రమే ఈ పథకాల ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో అర్హత లేని వారు స్వచ్ఛందంగా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల నుంచి తప్పుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని గళ్ళా మాధవి పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఆలోచనతో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సంజీవని కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అలాగే పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు పి4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఇంటిని ఆరోగ్యవంతమైన, ఆర్థికంగా బలోపేతమైన కుటుంబంగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్న వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి సవాల్ విసిరారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను అదే విధంగా కొనసాగించే ధైర్యం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. వృద్ధులకు రూ.4,000, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15,000, దివ్యాంగులకు రూ.10,000, కిడ్నీ, తలసేమియా బాధితులకు ప్రత్యేక పెన్షన్లు అందించే ఈ విధానాన్ని 2029లో అధికారంలోకి వస్తే యథాతథంగా కొనసాగించగలరా? కనీసం ఒక్క నెలైనా ఈ స్థాయిలో పెన్షన్లు అందిస్తూ పరిపాలించగలరా? అని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అనుమానాలు సృష్టించడమే వైసీపీ నాయకుల పనిగా మారిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ను తయారు చేయాలని ఆలోచిస్తుంటే, వైసీపీ నాయకులు ప్రతి గల్లీలో ఒక గూండాను తయారు చేయాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే కూటమి పాలనకు, అరాచక ధోరణులకు మధ్య ఉన్న తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని అన్నారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి విజయాన్ని అందించాలని కోరారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని, స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు.

సూర్య నాయక్