BREAKING
ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీను ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి ఎన్నికల విధులకు ఆన్‌లైన్ రాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల టేబుల్ టెన్నిస్ లో చిన్నమడూరు విద్యార్థుల సత్తా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు

దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ

Select Suryaa Now
దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ

సూర్య బోయినిపల్లి..ఈ నెల 29న జరగనున్న దీక్షా దివాస్ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో  బోయినిపల్లి మండల కేంద్రంలో ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత మాధవ్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్ చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చేసిన పోరాటం, త్యాగాలను ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు వివరించారు. కేసీఆర్  లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, తన పదవులకు రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు.
ఎన్నో అవరోధాలు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన దీక్షా దివాస్ సభకు మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జంపుక ఆనంద్, మండల మాజీ కో-ఆప్షన్ మహమ్మద్ అజ్జూ, అక్కనేపల్లి కర్ణాకర్, ముద్దం రవి, చిందం రమేష్, బత్తినీ కమల్ గౌడ్, కన్నం సాగర్, తొంటి మధుకర్, పెగ్గర్ల శంకర్, పెగ్గర్ల సిద్దు, బుర్ర పూర్ణ చందర్, వసలా శ్రీనివాస్, గుర్రం జగన్, మల్లరపు చెందు, ఏడాపెల్లి తిరుపతి, దుస మధు, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.