ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ
వర్ధన్నపేట, మేజర్ న్యూస్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 65వ డివిజన్ చింతగట్టు గ్రామానికి చెందిన దామెర రాజేందర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగడంతో ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. రాజేందర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం గడపాలని ఆకాంక్షించారు.ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడం తన బాధ్యతగా భావిస్తానని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో 65 వ డివిజన్ అధ్యక్షులు నేదునూరి సునీల్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్, పిఎసిఎస్ మాజీ చేర్మెన్ బిల్లా ఉదయ్ రెడ్డి,హసన్పర్తి మండలం మహిళ ఉపాధ్యక్షురాలు బత్తుల స్వాతి,మధుసూదన్ రెడ్డి
దామెర సాగర్, యూవరాజు
శ్రీకాంత్ రెడ్డి, నేదునూరి శ్రీనివాస్, భాషబోయిన కుమారస్వామి,
నంద్దునురి కిషన్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ; వేణు, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా