BREAKING
పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాదానికి ఆహ్వానం! మార్పు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత.. భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం

ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాదానికి ఆహ్వానం!

Select Suryaa Now
ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాదానికి ఆహ్వానం!
సూర్య, లక్షెట్టిపేట : పట్టణంలోని స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ ఎలాంటి రక్షణ కంచె లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం ప్రజలు, ఖాతాదారులు, వాహనదారులు రాకపోకలు సాగించే ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ బహిరంగంగా దర్శనమిస్తోంది. చుట్టూ ఫెన్సింగ్‌ లేకపోవడంతో ఎవరైనా పొరపాటున సమీపానికి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, పాదచారుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.గతంలో విద్యుత్‌ ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపిన నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం జరిగాక స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం మేలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత విద్యుత్‌ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరుతున్నారు.