telangana
పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్
సూర్య, జన్నారం : జన్నారం మండలం పొనకల్ మేజర్ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తును మంగళవారం పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కు సుష్మ భూమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమనే ఆలోచనతో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది నామినీలను ఎంపిక చేసుకోవచ్చని, అర్హత కలిగిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా జీవిత బీమా చేసుకోవాలన్నారు. ప్రారంభ శిబిరంలో ఉపసర్పంచ్ అప్పాల జలపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసియుల్లా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంద రాజేష్, వార్డు సభ్యులు పిల్లి మల్లయ్య, మోసిన్ ఖాన్, సంతోష్, అంజన్న, రవీందర్, పార్టీ నాయకులు జక్కు భూమేష్, దుమాళ్ళ ప్రవీణ్, రాగుల శంకర్, రజాక్, నర్సింగరావు, కార్యదర్శి రేగొండి రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.