BREAKING
ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీను ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి ఎన్నికల విధులకు ఆన్‌లైన్ రాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల టేబుల్ టెన్నిస్ లో చిన్నమడూరు విద్యార్థుల సత్తా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు

పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్

Select Suryaa Now
పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్

గుంటూరు : గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నగరంలోని జియావుద్ధీన్ నగర్, కపర్ది నగర్, ఆర్టీసి కాలనీ, ఇజ్రాయిల్ పేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులు, శానిటేషన్ పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఏఈ, కార్యదర్శి తమ పరిధిలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, నీటి శ్యాంపిల్స్ సేకరించి నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు సదరు రిపోర్టులను తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. త్రాగునీటి పైప్‌లైన్ల లీకులు తలెత్తితే తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఆర్టీసి కాలనిలోని స్మృతి వనం పార్క్ లో అభివృద్ధి పనులు చేపట్టాలని, మణిపురం వంతెన కింద ఉన్న ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కి మరమత్తులు చేయాలని డిఈఈని ఆదేశించారు. నూతన సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, ప్రతి పనికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ నుండి సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సంబంధిత కాంట్రాక్టర్లతో పాటు అధికారులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఈ-ఆటోల ద్వారా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, ప్రతి ఆటోకు విధిగా రూట్ మ్యాప్ ప్రకారమే చెత్త సేకరణ సక్రమంగా జరగాలని ప్రజారోగ్యాధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, రోడ్లపై చెత్త కనిపించడానికి వీలులేదని, కమర్షియల్, వీధి వ్యాపారులు ఎవరైనా రోడ్లు, డ్రైన్లలో వ్యర్థాలు వేస్తే వారిపై భారీగా అపరాధ రుసుం విధించాలని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోకుండా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేసి, స్పందించకుంటే జరిమానాలు విధించి శుభ్రం చేయించాలని ఆదేశించారు.ఈ పర్యటనలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ డి.సుందర్రామిరెడ్డి, డిఈఈ హనీఫ్, ఎస్ఎస్ సాంబయ్య, కార్పొరేటర్ కె.పిచ్చిరెడ్డి, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

సూర్య నాయక్