BREAKING
ముండ్లమూరు సర్పంచ్ గా సోమేపల్లి శ్రీను ప్రతి ఇంటి నుండి పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే చంద్రబాబు లక్ష్యం : ఎమ్మెల్యే మాధవి ఎన్నికల విధులకు ఆన్‌లైన్ రాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల టేబుల్ టెన్నిస్ లో చిన్నమడూరు విద్యార్థుల సత్తా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాను పటిష్టం చేయాలి : నగర కమిషనర్ పొనకల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సుష్మ భూమేష్ జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్ ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తు చేసుకునే ప్రజలకు కార్యకర్తలు సహకరించాలి దీక్షా దివాస్ సభను విజయవంతం చేద్దాం..ఇంటింటా బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ తిర్యాణిలో కార్తీక పౌర్ణమి శోభ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు పరామర్శ డిసెంబర్ 9న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి సర్దుమణగని కూటమి విభేదాలు.. రెండో రోజు కూడా వాయిదా పడిన ఎన్నిక రాసిమెట్ట విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన విదేశీయులు

జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్

Select Suryaa Now
జీడికల్ రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా గుర్రం బాలరాజు గౌడ్

లింగాలఘణపూర్, మేజర్ న్యూస్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జీడికల్ వీరాచల రామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్‌గా జనగామ జిల్లా, లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామానికి చెందిన గుర్రం బాలరాజు గౌడ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలో, ఆయన సహకారంతో దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని బాలరాజు గౌడ్ పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తానన్నారు. స్వామివారి సేవలో నిమగ్నమై దేవస్థానానికి మరింత మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకువస్తానని ఆయన స్పష్టం చేశారు.

రిపోర్టర్; కార్తీక్ ,లింగాల గణపురం, జనగామ జిల్లా