andhrapradesh
ముప్పవరం విద్యార్థిని యజ్ఞశ్రీకి అరుదైన ఘనత.. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపిక..
సూర్య న్యూస్ అద్దంకి.
జె.పంగులూరు మండలం ముప్పవరం గ్రామానికి చెందిన తిరుమలశెట్టి యజ్ఞశ్రీ రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ దీపాంజలి నగర్ టౌన్‌షిప్‌లోని సంగం హాల్‌లో కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ, బీఈఈ ఆదేశాల మేరకు 'ఎనర్జీ కన్జర్వేషన్' అంశంపై రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. 8,9,10వ తరగతి విద్యార్థుల 'బీ' గ్రూప్ విభాగంలో ఒంగోలు (భాగ్యనగర్) నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న తిరుమలశెట్టి యజ్ఞశ్రీ విజేతలలో ఒకరిగా నిలిచారు. విజేత యజ్ఞశ్రీ కి 30 వేల రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంస పత్రాన్ని అందించారు. మొత్తం ఆరుగురు విద్యార్థులను డిసెంబర్‌లో దిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు మొత్తం ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేయగా అందులో యజ్ఞశ్రీ ఒకరు.
ముప్పవరం వాసి అయిన యజ్ఞశ్రీ ఈ స్థాయిలో రాణించడం పట్ల తండ్రి వెంకటేశ్వరరావు, కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.