BREAKING
ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్‌.. ప్రమాదానికి ఆహ్వానం! మార్పు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ తిరుప్పరంకుండ్రం దీపం వివాదంతో తమిళనాడులో ఉద్రిక్తత.. భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం భారీ ఇనుప ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి మృతుని మట్టి ఖర్చులకు రూ 5000 ఆర్థిక సాయం కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *నిధుల వినియోగం, పనుల పురోగతి, పనితీరు సూచికల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలి* *సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* దామరచెడు భవాని మాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ పదవులు కొనుక్కునేందుకు ముష్టి వేయండి కార్తీక పౌర్ణమికి పెద్దాపూర్‌లో భక్తి వెల్లువ! - 6 వేల మందితో నృసింహస్వామి గిరి ప్రదక్షిణ.. - ఆధ్యాత్మిక శోభతో మార్మోగిన క్షేత్రం ముప్పవరం విద్యార్థిని యజ్ఞశ్రీకి అరుదైన ఘనత.. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు ఎంపిక.. సంగారెడ్డి బేవరేజ్ కంపెనీల నీటి నాణ్యతపై ఆందోళన.. ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం

కార్తీక పౌర్ణమికి పెద్దాపూర్‌లో భక్తి వెల్లువ! - 6 వేల మందితో నృసింహస్వామి గిరి ప్రదక్షిణ.. - ఆధ్యాత్మిక శోభతో మార్మోగిన క్షేత్రం

Select Suryaa Now
కార్తీక పౌర్ణమికి పెద్దాపూర్‌లో భక్తి వెల్లువ!  - 6 వేల మందితో నృసింహస్వామి గిరి ప్రదక్షిణ.. -  ఆధ్యాత్మిక శోభతో మార్మోగిన క్షేత్రం

 


సూర్య – జూలపల్లి:

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. తొమ్మిదోసారి నిర్వహించిన స్వామివారి గిరి ప్రదక్షిణకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 6 వేల మంది భక్తులు పాల్గొని కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడిని సంతరించుకోగా, కొండ ప్రాంతమంతా గోవింద నామస్మరణలు, నృసింహ నామ సంకీర్తనలతో మార్మోగింది.ప్రకృతి ఒడిలో దక్షిణాభిముఖంగా యోగముద్రలో స్వయంభువుగా వెలసిన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా విరాజిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా, ఆపదలో అండగా నిలిచే ఆరాధ్య దైవంగా భక్తుల కొలువుదీరిన ఈ క్షేత్రం అనతికాలంలోనే విశేష ప్రాచుర్యం పొందింది. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణలకు భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాల పరిధిని దాటి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుండటం విశేషం. ఈ క్షేత్ర విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేయడంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ సంకల్పకర్త సురేష్ ఆత్మారాం మహారాజ్ గురూజీ పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. గతంలో జరిగిన ఏడో, ఎనిమిదో గిరి ప్రదక్షిణల్లో పాల్గొన్న ఆయన భక్తులకు గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతను వివరించి ఆధ్యాత్మికంగా ప్రోత్సహించారు. ఎనిమిదో గిరి ప్రదక్షిణ సందర్భంగా పెద్దాపూర్ ఆలయం నుంచి కొండగట్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించడంతోపాటు అక్కడి గిరి ప్రదక్షిణలోనూ పాల్గొన్నారు. దీంతో పెద్దాపూర్ నృసింహ క్షేత్ర విశిష్టత మరింతగా వెలుగులోకి వచ్చి వివిధ ప్రాంతాల భక్తుల దృష్టిని ఆకర్షించింది.
కార్తీక పౌర్ణమి పవిత్రతకు నృసింహస్వామి ఆరాధన తోడవడంతో తొమ్మిదో గిరి ప్రదక్షిణకు ఈసారి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో కొండ చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, కొండ పరిసరాలు జాతరను తలపించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రతి నెలా నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణలతో భక్తుల ఆదరణ పెరుగుతుండగా, పెద్దాపూర్ శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది రాష్ట్రస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది. తొమ్మిదో గిరి ప్రదక్షిణలో వేలాదిమంది భక్తులు పాల్గొనడం క్షేత్ర ప్రాచుర్యానికి నిదర్శనంగా నిలిచింది.