రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
సూర్య మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో నూతనంగా మంజూరైన 47చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను గ్రామ సర్పంచ్ తీట్ల లహరి రాజేష్ లబ్ధిదారులకు అందజేశారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్లు నిరుపేదలకు ఆర్థిక భరోసానిస్తాయని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చొరవతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గణవేని నందిని మల్లేష్, వార్డు సభ్యులు కత్తి నరేష్, కలసాని రాజన్న, బాస రాజరెడ్డి, మహ్మద్ బషీర్, బొల్లారపు లక్ష్మీ, బైర లక్ష్మీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.