పాదయాత్రను చేపట్టిన శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ మహారాజ్
సూర్య రెంజల్ : మండల కేంద్రంలోని త్రిలింగ ఆలయం వద్ద మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు కృష్ణ మహరాజ్ కార్తీక మాస దీక్ష విరమించుకోని, పాదయాత్రను రెంజల్ నుండి కందకుర్తి త్రివేణి సంగమ గోదావరి నది వరకు చేపట్టనున్నారు. మంగళవారం శివాలయంలో మహాదేవునికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చి, పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 12 కిలోమీటర్ల మేరకు పాదయాత్రను చేపట్టడం జరుగుతుందని, గత కొన్ని సంవత్సరాలు నుండి ప్రతి కార్తీక మాస దీక్ష విరమణ తర్వాత పాదయాత్రను చేపట్టడం జరుగుతుందని మహారాజ్ తెలిపారు. ఆయన వెంట మల్లారం ఆలయ కమిటీ నిర్వాహకులు, రెంజల్ గ్రామ దేవాలయ కమిటీ నిర్వాకులు, పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.