BREAKING
జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో గెలవాలి నవోదయ ప్రవేశ పరీక్షకు 6,970 మంది అభ్యర్థులు.. 28 పరీక్ష కేంద్రాలు భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. బ్లెయిర్ టిక్నర్ దూరం, జట్టులో మార్పులు సెమీస్ బెర్తుపై ఇండియా ఏ కన్ను.. యూఏఈతో కీలక పోరులో హోరాహోరీ! కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మెట్ల రమణబాబు ఎన్నికల ప్రచారం.. ఊట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇల్లు ధ్వంసం ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ ‘సీన్’.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్, డేట్ ఫిక్స్! పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు ఆరనీకుమా ఈ దీపం .. కార్తీక దీపం చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక సీక్రెట్ రివీల్.. ‘మెగావర్స్’ ప్రోమోతో నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ పాదయాత్రను చేపట్టిన శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ మహారాజ్ భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్

ఆరనీకుమా ఈ దీపం .. కార్తీక దీపం

Select Suryaa Now
ఆరనీకుమా ఈ దీపం .. కార్తీక దీపం


ఎమ్మిగనూరు,సూర్య ప్రతినిధి..కైలాసవాస.. ఈశ జగదీష.. మమ్ము కరుణించరావయ్యా పరమేశ..  అంటూ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ఎంతో శుభప్రదమైన మాసం కార్తీక మాసం.. ఈ మాసాంతం తెల్లవారుజామునే చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి జీవితంలో ఉన్న చీకటి రోజులు తొలగిపోయి వెలుగులు నిండాలని భక్తి పారవశ్యంతో శ్రీ శివలింగార్చన, పార్వతీదేవి పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. మంగళవారం కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం తుంగభద్ర తీరాన ఉన్న శ్రీ గురజాల రామలింగేశ్వర స్వామి ఆలయం లో భక్తుల పోటెత్తారు.. పవిత్ర తుంగభద్రా నదిలో శ్రావణమాచరించి భక్తి భావంతో అభిషేకాలు చేపట్టారు.. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అంటూ తుంగభద్రా నదిలో దీపాలను వదిలి మొక్కుకున్నారు. భక్తులకు ఆలయంలో గ్రామ పెద్దలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు హంపి స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి కి  అభిషేకాలు తోపాటు పర్వత వర్ధిని దేవికి కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా చేశారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి , ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా*