BREAKING
భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్ శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !! బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్ల రచ్చ.. డేంజర్ జోన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు, వీఐపీ పాస్ ట్విస్ట్ శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్ ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ బసాపురంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి ప్రచార హోరు... ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి

Select Suryaa Now
శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి

 ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రం పెదపాడు రోడ్డు లో ఏపీ మోడల్  స్కూల్ పక్కన సుమారు 2.50 కోట్ల రూపాయలతో నిర్మించిన శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుడు కె పాపారాయుడు తెలిపారు. ఈ నెల 27,28,29  మూడు రోజులపాటు శ్రీ బీర లింగేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలుపుతూ 27వ తేదీ శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్య హవాచము, రిత్విక్ వరణము, యాగశాల ప్రవేశం, రక్షాబంధనము, గణపతి హోమము, మొదలగు పూజలు చేసి హారతి తీర్థ  ప్రసాదములు అందించగలరని తెలిపారు. శనివారం 28వ తేదీ  ఉదయం ప్రాతఃకాల పూజ, పూర్వక విశేష అభిషేకం, మూలమంత్ర హోమము, మొదలగు పూజలు చేసి హారతి తీర్థప్రసాదములు ప్రసాదించబడునని తెలిపారు. 
ఆదివారం 29వ తేదీ ఉదయం ధనుస్సు లగ్నం శుభ పుష్యరాంశమందు, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ద్వజ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమము, కళాన్యాసము, కక్ష జ్వాల బలిహరణము, దేను దర్శనము, పూర్ణాహుతి, మంగళహారతి ప్రత్యేక పూజలు చేసి పురోహితులు విరివింటి కృష్ణమూర్తి శర్మ, తోటపల్లి వెంకట గురురాజు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదములు ప్రసాదింపబడునని తెలిపారు. శ్రీ బీర లింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం కీర్తిశేషులు డాక్టర్ పుల్లన్న ఎంతో ఎనలేని కృషి చేయడం ఆయన ఆశయం నేటితో  పూర్తయిందని జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. పాపారాయుడు తెలిపారు. అలాగే బీర లింగేశ్వర స్వామి ఆలయానికి ఒకటిన్నర ఎకరం స్థలము విరాళంగా దానం చేసిన పాల సుంకన్న సహకారంతో నేడు ఈ దేవాలయం   ప్రతిష్ట కార్యక్రమానికి రూపు దిద్దుకున్నదని చెప్పవచ్చని ఆయన తెలిపారు. ఈ దేవాలయం పూర్తి కావడానికి జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.కె రంగస్వామి ఉమ్మడి కర్నూలు జిల్లా కురవ సంఘం నాయకులతో కలసి మెలసి ఉమ్మడిగా ఉండి నేడు ఈ దేవాలయం ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. కనుక ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ కులస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ బీర లింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను విజయవంతం చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. పాపారాయుడు కురువ కులస్తులందరిని ప్రార్థిస్తూ అభ్యర్థించారు.