ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సూర్య ఎల్లారెడ్డిపేట
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు.మంగళవారం రోజున జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలు, నిర్వహణ రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అదేవిధంగా నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, నమోదైన కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.రాత్రి సమయాల్లో గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామాలను తరచూ సందర్శిస్తూ సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలు, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు తనిఖీలో సీఐ వెంకటేష్, ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.