BREAKING
భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్ శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !! బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్ల రచ్చ.. డేంజర్ జోన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు, వీఐపీ పాస్ ట్విస్ట్ శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్ ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ బసాపురంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి ప్రచార హోరు... ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ

Select Suryaa Now
భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ

సూర్య జగిత్యాల ప్రతినిధి:మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్ లు పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ 
సందర్భంగా కాసెట్టి తిరుపతి వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ, భోగ శ్రావణిపై విమర్శలు చేసే ముందు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని హితవు పలికారు. జిల్లాలో సుమారు 2,400 మంది చేనేత కార్మికులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 100 మందికే మంజూరు చేయడం అన్యాయమన్నారు. కల్లుగీత, చేనేత కార్మికుల సమస్యలపై భోగ శ్రావణి స్పందిస్తే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నప్పటికీ అభివృద్ధి పనులకు టెండర్లు పిలవకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.ఈ సమావేశంలో  బీజేపీ లేబర్ సెల్ జిల్లా కన్వీనర్ కట్ట విజయ్, పవన్ సింగ్, ఇట్యాల రాము, ముద్దం నాగరాజు, జాజర్ల రాజు, దొగ్గలి విజయ్, ప్రభాకర్, కొండ్ర జగన్ తదితరులు పాల్గొన్నారు.