BREAKING
శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్ ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ బసాపురంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి ప్రచార హోరు... ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ కార్తీక పౌర్ణమి వేడుకలతో వాడరేవు సముద్రతీరం కిటకిట గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించడమే లక్ష్యం త్రివేణి సంగమ గోదావరికి మహా పూజ కార్యక్రమం పణితి డానియేలు ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న ద్విచక్ర వాహనం ఢీకొని మృతి... జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ *చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం* *3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..*

గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

Select Suryaa Now
గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

సూర్య గంజిరావుపేటమంగళవారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గంభీరవుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, నిర్వహణ రికార్డులు, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ఎస్పీ   మాట్లాడుతూ...ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్టేషన్ పరిధిలో నమోదైన కేసులలో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలీస్ శాఖకు సంబంధించిన వెబ్ అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎస్పీ  వెంట డిఎస్పీ నాగేంద్రచారి, ఎస్.ఐ బాలరాజు సిబ్బంది ఉన్నారు.