BREAKING
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందించడమే లక్ష్యం త్రివేణి సంగమ గోదావరికి మహా పూజ కార్యక్రమం పణితి డానియేలు ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న ద్విచక్ర వాహనం ఢీకొని మృతి... జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ *చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం* *3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..* హైదరాబాద్ వీధుల్లో విజయ్ ఆంటోనీ సందడి.. అమీర్‌పేటలో మిర్చి బజ్జీలు వేసి ఇరానీ చాయ్ తాగిన స్టార్ హీరో నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి ఫన్నీ రిప్లై పెద్ది పాట వివాదంపై శ్రుతి హాసన్ స్పష్టత.. జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ కళ్యాణదుర్గం రూరల్ మండలంలో సెక్షన్ 163 అములు... 28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..?మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర..

బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న ద్విచక్ర వాహనం ఢీకొని మృతి...

Select Suryaa Now
బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న ద్విచక్ర వాహనం ఢీకొని మృతి...

బ్రహ్మసముద్రం: మండలంలోని కన్నేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న (23) ప్రాణాలు కోల్పోయాడు. ఎనిమిది నెలల క్రితమే వివాహమైన యువకుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు నెలల గర్భిణిగా ఉన్న భార్య అర్చన భర్త మృతిని జీర్ణించుకోలేక రోదిస్తున్న తీరు గ్రామస్థులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. కన్నేపల్లి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశులు కుమారుడు ముక్కన్న వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా జీవనం సాగిస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రనాయకనహళ్లికి చెందిన అర్చనతో వివాహం జరిగింది. దంపతుల సంసారం సంతోషంగా సాగుతున్న తరుణంలో విధి రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. సోమవారం సాయంత్రం ముక్కన్న తన స్వగ్రామమైన కన్నేపల్లి నుంచి బుడిమేపల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ముక్కన్న ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముక్కన్న తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న వంశీ కూడా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, బంధువులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన ముక్కన్నను చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ముక్కన్న మృతి చెందాడు. మరోవైపు గాయపడిన వంశీని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎనిమిది నెలల క్రితమే మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అర్చనకు ఇంతలోనే భర్త దూరం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. కడుపులో బిడ్డతో భర్త కోసం ఎదురుచూస్తున్న ఆమెకు ఈ చేదువార్త తీరని ఆవేదనను మిగిల్చింది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. ముక్కన్న మృతివార్త తెలుసుకున్న కన్నేపల్లి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. యువకుడి అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఒక నిండు ప్రాణం బలికావడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.