BREAKING
పణితి డానియేలు ఆదరణ కూడికలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముక్కన్న ద్విచక్ర వాహనం ఢీకొని మృతి... జగ్గయ్యపేట పట్టణంలో నూతన విద్యుత్ పోల్స్, లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య),మున్సిపల్ చైర్మన్ శ్రీమతి నరేంద్రుల వినీత కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ *చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం* *3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..* హైదరాబాద్ వీధుల్లో విజయ్ ఆంటోనీ సందడి.. అమీర్‌పేటలో మిర్చి బజ్జీలు వేసి ఇరానీ చాయ్ తాగిన స్టార్ హీరో నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి ఫన్నీ రిప్లై పెద్ది పాట వివాదంపై శ్రుతి హాసన్ స్పష్టత.. జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ కళ్యాణదుర్గం రూరల్ మండలంలో సెక్షన్ 163 అములు... 28వ వార్డు కౌన్సిలర్‌గా పచ్చిపాల రామకృష్ణ ఆచారి ప్రమాణం : అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే జహా,చైర్మన్ శ్రీరామ్ చినబాబు : శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు,వార్డు ప్రజలు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా..?మాజీ మంత్రి శైలజానాథ్‌ను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. నవంబర్ 25 నుండి అగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం: జిల్లా ఎస్పీ రేపటి నుంచి 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర.. పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు మళ్లీ రాబోతున్న 'గోల్డ్ స్పాట్'..

కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ *చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం* *3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..*

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ  *చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం*  *3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..*

కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తుల పోటెత్తిన రద్దీ

*చింతపల్లి ఉమామహేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం*

*3 వేల మందికి పైగా భక్తుల దర్శనం..*

*మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:*

కార్తీక పౌర్ణమి సందర్భంగా చింతపల్లి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 3 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

*స్వయంభువుగా వెలసిన ముగ్గురు దేవతామూర్తులు ప్రత్యేక ఆకర్షణ*

చింతపల్లి ఉమామహేశ్వర ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. ఇక్కడ ఉమామహేశ్వర స్వామితో పాటు అయ్యప్ప స్వామి, పంచముఖ హనుమాన్ స్వామివారు స్వయంభువుగా వెలిశారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో భక్తిశ్రద్ధలతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దీంతో కార్తీక మాసంలోనే కాకుండా ప్రత్యేక పర్వదినాల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తుంటారు.

*భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు*

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. భక్తులు దీపాలు వెలిగించిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. కమిటీ సభ్యుల సమన్వయంతో వేడుకలు ప్రశాంతంగా సాగాయి. ఆలయ కమిటీ చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నాగిరెడ్డి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి దండ ప్రభాకర్ రెడ్డి, సభ్యులు బండి శంకర్, మేడ యాదగిరి రెడ్డి, నాతి నాగరాజు, అంబటి మల్లేష్, డొనేటి బిక్షం, రమణ, కల్లాల రంగారెడ్డి, కోటేశ్వరరావు, బొజ్జ మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.