త్రివేణి సంగమ గోదావరికి మహా పూజ కార్యక్రమం
సూర్య రెంజల్ : మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ గోదావరి నదికి సీతారాం త్యాగి మహారాజ్ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని, నదికి పూజ కార్యక్రమాలు నిర్వహించి,హారతిని చేపట్టారు. అనంతరం ఆశ్రమం వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు రమేష్, నాయకులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.