కార్తీక పౌర్ణమి వేడుకలతో వాడరేవు సముద్రతీరం కిటకిట
కార్తీక పౌర్ణమి వేడుకలతో వాడరేవు సముద్రతీరం కిటకిట
కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల వాడరేవు సముద్రతీరం భక్తులతో కిక్కిరిసింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సముద్రతీరంలో కార్తీక దీపాలను వెలిగించి, భక్తిశ్రద్ధలతో శివయ్యను స్మరించుకున్నారు. దీపాల వెలుగులతో వాడరేవు తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.