BREAKING
భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు.. సినీ ప్రియులకు రామాయణ టీమ్ బంపరాఫర్.. కేవలం రూ.99కే థియేటర్లలో చూసే ఛాన్స్ శ్రీ గిరి గుట్ట పైన రెండవ గిరి ప్రదక్షిణ బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కదలని క్యూ లైన్లు..తిరగ బడ్డ భక్తులు..కొండగట్టు అంజన్న ప్రధాన ద్వారం మూసివేత గలగల గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి సర్పంచ్ అభ్యర్థి సంతోష్ !! బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్ల రచ్చ.. డేంజర్ జోన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు, వీఐపీ పాస్ ట్విస్ట్ శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేయండి భోగ శ్రావణిపై మున్సిపల్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సంఖ్య పెంచాలి. సర్పంచ్ ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం - జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగ్గా గౌడ్ బసాపురంలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి ప్రచార హోరు... ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

బైరెడ్డిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే

Select Suryaa Now
బైరెడ్డిపల్లి  కూటమి సర్పంచ్ అభ్యర్థి భువచంద్రగౌడు కు మద్దతుగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే

 

బైరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన భువన్ చంద్ర గౌడ్‌కు మద్దతుగా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి మండలానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.అనంతరం 219 జాతీయ రహదారి వెంబడి ఉన్న దుకాణదారులను ఎమ్మెల్యే కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. సర్పంచ్ అభ్యర్థి భువన్ చంద్ర గౌడ్‌కు కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
అనంతరం బైరెడ్డిపల్లి మండల ముస్లిం మైనార్టీ సోదరులతో ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బైరెడ్డిపల్లి మండల ముస్లిం మైనార్టీలంటే తనకు ప్రత్యేక గౌరవమని, వారి అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు.
ఎన్నికల కోసం మాత్రమే హామీలు ఇవ్వడం లేదని, తన మనసులో నుంచి వచ్చిన మాటలని పేర్కొన్నారు. గతంలో బైరెడ్డిపల్లి పెద్ద మసీదు అభివృద్ధికి రూ.40 లక్షలు కేటాయించామని, మరో రూ.10 లక్షలు కావాలని కోరగా రూ.20 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.అలాగే బైరెడ్డిపల్లి గ్రామంలో ఇళ్లు లేని మైనార్టీ కుటుంబాలకు ఎన్నికల అనంతరం ఇళ్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. క్షేత్రస్థాయి పర్యటనలో మైనార్టీ ప్రాంతాల్లో కనిపించిన సమస్యలను వారు అడగకపోయినా గుర్తించి పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపుతానని తెలిపారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మత గురువులకు గౌరవ వేతనం అందించిందని, అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వారికి కూడా తిరిగి గౌరవ వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మైనార్టీ సోదరులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం, పార్టీ నాయకులు కృషి చేస్తారని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఎమ్మెల్యే హామీలపై ముస్లిం మైనార్టీ సోదరులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

జి. సుబ్రమణ్యం, రిపోర్టర్, బైరెడ్డిపల్లి