జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో గెలవాలి
జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయిలో గెలవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఓటు హక్కు అనే అంశంపై జిల్లాలోని వివిధ ప్రాంత విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో 20 మంది విద్యార్థులు ఎంపిక కాగా వారికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో గెలిచినవారు రాష్ట్ర స్థాయిలో సైతం రాణించాలని పేర్కొన్నారు.