BREAKING
బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో గెలవాలి నవోదయ ప్రవేశ పరీక్షకు 6,970 మంది అభ్యర్థులు.. 28 పరీక్ష కేంద్రాలు భారత్‌తో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. బ్లెయిర్ టిక్నర్ దూరం, జట్టులో మార్పులు సెమీస్ బెర్తుపై ఇండియా ఏ కన్ను.. యూఏఈతో కీలక పోరులో హోరాహోరీ! కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మెట్ల రమణబాబు ఎన్నికల ప్రచారం.. ఊట్పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం.. ఇల్లు ధ్వంసం ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ ‘సీన్’.. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్, డేట్ ఫిక్స్! పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు ఆరనీకుమా ఈ దీపం .. కార్తీక దీపం చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక సీక్రెట్ రివీల్.. ‘మెగావర్స్’ ప్రోమోతో నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ పాదయాత్రను చేపట్టిన శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ మహారాజ్ భాగ్యశ్రీ కుటుంబానికి అండగా నిలిచిన బీమా పథకం. ఆ భయానక ప్రమాదం తర్వాతే నాలో భక్తి పెరిగింది.. ఇండియన్ 2 ఘటనపై కాజల్ అగర్వాల్ ఎమోషనల్ రాజీవ్ హత్యపై రాహుల్ సంచలన ఆరోపణలు..

నవోదయ ప్రవేశ పరీక్షకు 6,970 మంది అభ్యర్థులు.. 28 పరీక్ష కేంద్రాలు

Select Suryaa Now
నవోదయ ప్రవేశ పరీక్షకు 6,970 మంది అభ్యర్థులు.. 28 పరీక్ష కేంద్రాలు

 

 

 ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి  2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 6,970 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 12 కలిపి మొత్తం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.పరీక్ష సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల సెంటర్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవల్ అబ్జర్వర్లకు కర్నూలులోని ఈ-క్యాంప్ మోడల్ స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షా నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతలపై వివరించారు.ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జవహర్ నవోదయ విద్యాలయ, బనవాసి ప్రిన్సిపాల్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా