కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మెట్ల రమణబాబు ఎన్నికల ప్రచారం..
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మెట్ల రమణబాబు ఎన్నికల ప్రచారం..
బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థి శ్రీవాణికి మద్దతుగా కూటమి నేతలు.. అమలాపురం మేజర్ న్యూస్ కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామంలో బెండమూర్లంక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు సతీమణి శ్రీవాణికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, అమలాపురం మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు, 33వ వార్డు కౌన్సిలర్ జంగా అబ్బాయి వెంకన్న, దేవరపల్లి శాంతికుమార్, మాజీ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, మీడియా ఇన్‌చార్జి శ్రీను గంధం తదితరులు పాల్గొన్నారు.