BREAKING
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు

Select Suryaa Now
ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు

అమరావతి, నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిర్వహణను మరింత శాస్త్రీయంగా, పటిష్టంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 'డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ' (DTMRS)ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.

రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) పరిపాలన, కార్యాచరణ నియంత్రణలో ఈ నూతన విభాగం పనిచేయనుంది. ఈ డైరెక్టరేట్‌కు అధిపతిగా (డైరెక్టర్‌గా) ఐజీ (ఇన్‌స్పెక్టర్ జనరల్) స్థాయి అధికారిని నియమించనుండగా, ఆయనకు సహాయకుడిగా డీఐజీ స్థాయి అధికారి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడకుండా, ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్న సిబ్బందితోనే ఈ కొత్త విభాగాన్ని నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై ప్రమాదకర ప్రాంతాల (బ్లాక్ స్పాట్స్) గుర్తింపు, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యల అమలును ఈ ప్రత్యేక డైరెక్టరేట్ నిరంతరం పర్యవేక్షించనుంది.