స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం
గురజాలపట్టణానికి చెందిన స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు సాధువులకు అన్నదానకార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో గిరి ప్రదక్షణ చేయు మార్గంలో రుద్రాక్ష స్వామి ఆశ్రమం ముందు దాదాపు 5000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్మైల్ ఫౌండేషన్ చైర్మన్ గుండా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ తమ స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ చేయు భక్తులు,సాధువులకు ప్రతినెల పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. కావున స్వామివారిని దర్శించేందుకు విచ్చేసే భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి మానవతాదృక్పథం, భక్తిభావంతో దాతలు కూడా విస్తృతంగా సహకరించాలని ఆయన కోరారు. ఈఅన్నదానికి కార్యక్రమానికి, గురజాల వాస్తవ్యులు కటకం అంకారావు,శరమళ్ళ హనుమంతురావు,బడిదల శ్రీనివాసరావు,ఏచూరి మురళీకృష్ణ, కందిమల్ల శ్రీనివాసరావు,జవ్వాజి గణపతి,పాల్వాయి సుబ్బారెడ్డి, శాతం రాజు మురళీకృష్ణ, పెదకొండూరు వాస్తవ్యులు మొలబంటి కుమారి, పట్టేలా శివ నాగేశ్వరరావు,వెలివెల రాము, కొలసాని భార్గవి ఆర్థిక సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కొలసాని అనురాధ, గీతిక, ధనలక్ష్మి, వందనపు నాగేంద్రబాబు,బండి రవి, సేవాదళం సభ్యులు పాల్గొని సేవలందించారు.