తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి
తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి
*నీటి వృథా లేకుండా పైప్లైన్ లీకేజీలను తక్షణమే అరికట్టాలి.
*కమిషనర్ ఎం.జయకృష్ణ.
తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ఆదేశించారు. అలిపిరి సమీపంలోని కళ్యాణి ఫిల్టర్ హౌస్, జూ పార్క్ మార్గంలో నీటి సరఫరా పైప్ లైన్ లీకేజీలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా పైప్లైన్ లీకేజీలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పైప్లైన్ల ద్వారా నీరు వృథాగా పోకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరాయంగా, సక్రమంగా త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్య పనులను పరిశీలించి, మరింత మెరుగ్గా పనులు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. కమిషనర్ వెంట నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Raaju బ్యూరో,తిరుపతి జిల్లా