BREAKING
మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు. వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి :వాడపల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సాధారణ సమావేశం నేటి రాశి ఫలాలు – 8 అక్టోబర్ 2026 (గురువారం) నేటి పంచాంగం – 8 అక్టోబర్ 2026 (గురువారం) పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం

రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం

Select Suryaa Now
రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం

దేవరపల్లి, అక్టోబర్ 6 మేజర్ న్యూస్:రామన్నపాలెం గ్రామపంచాయతీలోని ఎస్.డబ్ల్యూ.పి.సి  షెడ్డు వద్ద ఎక్స్పోజర్ విజిట్‌లో భాగంగా మంగళవారం దేవరపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ నాగర్జునరావు  అధ్యక్షతన, డిప్యూటీ ఎంపిడిఓ వై రాజారావు  ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరపల్లి మండలంలోని 15 గ్రామపంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారుల సమక్షంలో గ్రామాల్లో చెత్త సేకరణ మరియు నిర్వహణపై కీలక అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద నుంచే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఏ విధంగా సేకరించాలో ప్రత్యక్షంగా వివరించారు. రామన్నపాలెం పంచాయతీ  సెక్రటరీ సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న  ఆదర్శవంతమైన చెత్త సేకరణ విధానాన్ని మండలంలోని మిగిలిన అన్ని గ్రామపంచాయతీల్లోనూ తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు.
అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ 'బిన్ - బ్యాగ్'  విధానాన్ని పాటించేలా స్థానిక ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించాలని శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి అధికారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ సిబ్బంది, హరిత రాయబారులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు పాల్గొన్నారు.