BREAKING
నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయం : ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేటి పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) ఖరీఫ్ ధాన్యం సేకరణకు పటిష్ట ప్రణాళిక 6, 7, 8 తేదీల్లో సేవా సేతు అభియాన్ క్యాంపులు

అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట..

Select Suryaa Now
అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట..

అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట..

అసత్య ప్రచారాలతో కాలక్షేపం

అభివృద్ధి ఆగదు, సంక్షేమం ఆగదు

పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్

కంకిపాడు,  మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు, గొడవర్రు, చలివేంద్రపాలెం, నెప్పల్లి గ్రామాల్లో రూ.2.15 కోట్లతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, పంచాయతీ గ్రాంట్‌ తదితర నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క ఈడుపుగల్లు గ్రామంలోనే వివిధ నిధులతో రూ.16 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే నిధులతో రూ.11 కోట్ల విలువైన పనులు చేపట్టామని, సీఆర్‌డీఏ ద్వారా రూ.105 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, గత టీడీపీ ప్రభుత్వంలో 90 శాతం పూర్తయిన పనులను సైతం పూర్తి చేయకుండా పక్కన పెట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను తీర్చుకుంటూనే నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి, కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు కళ్లకు కనిపిస్తుండటంతో వైసీపీ నాయకులు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలకు పరిమితమవుతున్నారని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, గ్రామీణ మౌలిక వసతులతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. మంత్రి నారా లోకేష్‌పై రాజకీయ కక్షతో డీఎస్సీ అంశాన్ని కూడా వైసీపీ నాయకులు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

✍️ ప్రేమ్ రాజ్, కంకిపాడు