BREAKING
నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు నేటి రాశి ఫలాలు: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) రాజ్‌కుమార్ సేవా స్ఫూర్తి చిరస్మరణీయం : ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేటి పంచాంగం: 6 అక్టోబర్ 2026 (మంగళవారం) ఖరీఫ్ ధాన్యం సేకరణకు పటిష్ట ప్రణాళిక 6, 7, 8 తేదీల్లో సేవా సేతు అభియాన్ క్యాంపులు

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం

Select Suryaa Now
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌..   రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం

పెనమలూరు,  మేజర్ న్యూస్ : తాడిగడపలోని కేఎంవీ స్పేసెస్ ఎల్‌ఎల్‌పీ ప్రాంగణంలో అక్టోబర్ 3న జరిగిన రూ.5 లక్షల విలువైన రాగి కేబుళ్ల చోరీ కేసును పెనమలూరు పోలీసులు ఛేదించి అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ప్రాంగణంలో భద్రపరిచిన 77 కాయిళ్ల రాగి వైర్లు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గన్నవరం డీఎస్పీ కే.జయకృష్ణ పర్యవేక్షణలో పెనమలూరు సీఐ ఎన్.వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వనకూరు శివారులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సతీష్ శంకర్ రహంగ్‌డేల్, దుర్గేష్ చిత్రారేన్ జైస్వాల్, ఆకాష్ కృష్ణ బావనే, నిజాం ఆఫ్తాబ్ అన్సారీ, మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేద్‌లాల్ రామ్‌లాల్ రౌత్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తుతో పాటు నేరానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. నిర్మాణ ప్రదేశాలు, గోదాములు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు రాత్రి వేళల్లో భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలని, సీసీ కెమెరాలు, తగిన వెలుతురు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు.