BREAKING
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. పసుపు కలర్ సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. 26వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నం పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప! దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్ కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు. రాజంపేటలో పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 13వ వార్డులో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి విస్తృత ప్రచారం 28 న అనంతపురం జిల్లా మహిళల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు అమెరికా దాటి బ్రిటన్‌కు అమెజాన్ ఆటోస్ విస్తరణ

26వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నం

Select Suryaa Now
26వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నం

ప్రొద్దుటూరు, నవంబర్ 25, మేజర్ న్యూస్:
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని 26వ వార్డులో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 26వ వార్డు కౌన్సిలర్ షేక్ మహేనూర్ ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజలకు మెరుగైన పారిశుధ్య వాతావరణం కల్పించాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 26వ వార్డులోని శాంతకుమారి వీధికి ఆనుకొని ఉన్న కొత్తపల్లె కాలువ పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి తీవ్ర అపరిశుభ్రతకు నిలయంగా మారిందన్నారు. కాలువకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, కంప చెట్లు విపరీతంగా పెరిగి దట్టమైన పొదలుగా మారాయని, వాటిలో విష సర్పాలు సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. పందుల సంచారం కూడా ఎక్కువైందని పేర్కొన్నారు.ఇదే ప్రాంతంలో ఉస్మాన్ మసీదు ఉండటంతో ప్రతిరోజూ ప్రార్థనల కోసం వచ్చే ముస్లిం సోదరులు, భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో పాటు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, కంప చెట్లను పూర్తిస్థాయిలో తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా వార్డులో కుక్కలు, పందుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోందని, రెండు రోజుల క్రితం ఒకే కుక్క ఆరుగురిని కరిచిన ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా వీధి కుక్కల సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.వార్డులో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని, డ్రైనేజీ కాలువలను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో దోమల బెడద భరించలేని స్థాయికి చేరుతోందని, ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కావున మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒకరోజు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం (గ్యాంగ్ వర్క్) నిర్వహించి వార్డులోని అన్ని కాలువలను శుభ్రం చేయించాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించాలని కోరారు. అలాగే కుక్కలు, పందుల బెడద నివారణకు తగిన చర్యలు చేపట్టి 26వ వార్డు ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని కౌన్సిలర్ షేక్ మహేనూర్ మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.