ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల.
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.
సూర్య న్యూస్ ముండ్లమూరు. పసుపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల పసుపుగల్లు, చింతల పూడి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మంచం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లు ను కోరారు. నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారం తో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామం లో ని సమస్య లను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బిజ్జం సుబ్బారెడ్డి, మాజీ జెడ్. పి.టి. సి పౌలు, మాజీ సర్పంచ్ ఇందురి పిచ్చిరెడ్డి, వార్డ్ మెంబర్ అభ్యర్ధి వరగాని అశోక్ తదితరులు పాల్గొన్నారు.