BREAKING
అసైన్డ్ భూమిలో అక్రమ ప్లాట్ల దందా! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తూ ముదిగుబ్బలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన జెసి మౌర్య భరద్వాజ్ ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా. పసుపు కలర్ సర్పంచ్ టిడిపి అభ్యర్థి గుడాల అమల. 26వ వార్డులో పారిశుధ్యం అధ్వాన్నం పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామం లో వూరిటి వెంకటప్పయ్య పెద్దకర్మకు హాజరైన పొన్నూరు వైసిపీ సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన రెండుసార్లు స్కూల్ కమిటీ చైర్మన్‌గా సేవలు.. నరసాపురం పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో నాగప్ప! దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి - మాజీ ఎంపీ వినోద్ కుమార్ కసింకోటలో అక్రమ వసూళ్ల కలకలం: ‘మంచివాడు’ అంటూనే నిండా ముంచేశాడు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం మంత్రుల పర్యటనలప్పుడే రోడ్లు గుర్తొస్తాయా..పొంగులేటి పర్యటన వేళ హడావుడిగా మరమ్మతులు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి  *బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించండి

*బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపు*

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడలోని బీసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాన రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకే ప్రాధాన్యతనిస్తూ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించకపోవడం బాధాకరమని అన్నారు.

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు నేటికీ పూర్తిస్థాయిలో రాజకీయ న్యాయం జరగడం లేదని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేకమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, వారికి పూర్తిస్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.

బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రిజర్వేషన్ల సమస్యలపై శాసనమండలిలో బలంగా మాట్లాడే నాయకుడు లేకపోతే భవిష్యత్తులో బీసీ తరాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అశోక్ హెచ్చరించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడిని ఎన్నుకోవాలని బీసీలు భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అగ్రవర్ణాల అభ్యర్థులకే అవకాశం కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రధాన రాజకీయ పార్టీల్లో బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అగ్రవర్ణాలకే కల్పిస్తున్నాయని అశోక్ ఆరోపించారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించకుండా అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని బీసీ యువజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల అభ్యర్థులకే అవకాశం కల్పించడం బీసీలను రాజకీయంగా అణచివేసే చర్యగా తాను భావిస్తున్నానని అశోక్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై బీసీ వర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన అన్నారు.

బీసీ పట్టభద్రులు తమ ఓటును అగ్రవర్ణాల అభ్యర్థులకు వేసి, భవిష్యత్తు బీసీ తరాలకు నష్టం కలిగించేలా నిర్ణయం తీసుకోవద్దని అశోక్ విజ్ఞప్తి చేశారు. బీసీల హక్కులు, విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దాసరాజు జయరాజ్, నాయిని భాస్కర్, పట్టేటి రమేష్, బోయిన ఉపేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.