BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

కొడంగల్‌లో అంగన్వాడి కేంద్రాలకు కొత్త భవనాలు

Select Suryaa Now
కొడంగల్‌లో అంగన్వాడి కేంద్రాలకు కొత్త భవనాలు

కౌడిడ్, ఊరగుంట తండాలో రూ.40 లక్షలతో నూతన భవనాల ప్రారంభం
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, కాడ అధికారి వెంకటరెడ్డి

దౌల్తాబాద్, అక్టోబర్ 5 (మేజర్ న్యూస్): కొడంగల్ నియోజకవర్గంలో అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, కాడ అధికారి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని కౌడిడ్ గ్రామం, ఊరగుంట తండాలో రూ.20 లక్షల చొప్పున రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగన్వాడి కేంద్రాల భవనాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఊరగుంట తండాలో గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే పౌష్టికాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో తల్లులకు చిరుధాన్యాల ప్రాధాన్యత, ప్రొటీన్లు, ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించారు. 0 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు తీసుకునే పౌష్టికాహారం వారి మెదడు అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని అంగన్వాడి సూపర్వైజర్ మంజుల, సిబ్బంది వివరించారు. గర్భిణీలు తీసుకునే ఆహారం పుట్టబోయే శిశువు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, అందువల్ల సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, డీసీసీ సభ్యుడు జంగం వీరన్న, సర్పంచులు రెడ్యానాయక్, ప్రమోద్ రావు, శ్రీకాంత్ రెడ్డి, రోజ రమేష్, శ్రీనివాస్ రెడ్డి, సరోజ నరేందర్, విజయలక్ష్మి అనంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కుర్మనీ దస్తప్ప, నాయకులు నర్సింలు, మల్లేశం, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి సూపర్వైజర్ మంజుల, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ శ్యామ్ సుందర్.