BREAKING
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు

పోలీసులకు మూడు నూతన స్నిఫర్ డాగ్స్

Select Suryaa Now
పోలీసులకు మూడు నూతన స్నిఫర్ డాగ్స్

విజయవాడ క్రైం,  మేజర్ న్యూస్ : ఎన్.టి.ఆర్. పోలీస్ కమిషనరేట్‌కు రెండు, ఈగల్ బృందానికి ఒక నూతన స్నిఫర్ డాగ్ కేటాయించారు. సుమారు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న మూడు కుక్కలు పోలీస్ కమిషనరేట్‌కు చేరుకున్నాయి. వీటిలో నైనా అనే డచ్ షెపర్డ్ జాతి ఆడ కుక్క పేలుడు పదార్థాల గుర్తింపు, ఆనవాళ్లను అనుసరించడంలో శిక్షణ పొందింది. దీనికి హెడ్ కానిస్టేబుల్ పి.నాగరాజు హ్యాండ్లర్‌గా ఉన్నారు. శిక్షణా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నైనా రెండో స్థానం సాధించింది. లక్కీ అనే బెల్జియన్ మెలనోయిస్ జాతి ఆడ కుక్క మాదకద్రవ్యాల గుర్తింపు, ఆనవాళ్లను అనుసరించడంలో శిక్షణ పొందగా, దీనికి కానిస్టేబుల్ బి.ఆర్.బి.రాజు, హెడ్ కానిస్టేబుల్ ఎన్.రామరాజు హ్యాండ్లర్లుగా ఉన్నారు. రాడో అనే బెల్జియన్ మెలనోయిస్ జాతి మగ కుక్కకు కానిస్టేబుల్ జి.అప్పలనాయుడు హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తుండగా, మాదకద్రవ్యాల గుర్తింపులో శిక్షణ పొందిన దీనిని ఈగల్ బృందానికి కేటాయించారు. ఈ సందర్భంగా అధికారులు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబును కలిసి శిక్షణ వివరాలను తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, డీసీపీ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.