40,43వ వార్డులలో కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం
బాపట్ల, మేజర్‌న్యూస్ :
బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 40,43వ వార్డులలో కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే శ్రీ నజీర్ అహ్మద్ గారితో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు, కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ ఇస్కా సునీల్ కుమార్ గారు స్థానిక వార్డులలో పర్యటించారు.
వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కూటమి మేనిఫెస్టోను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.