BREAKING
కేంద్ర నిధులకు బీఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ కేంద్ర నిధులకు బిఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు

కేంద్ర నిధులకు బిఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

Select Suryaa Now
కేంద్ర నిధులకు బిఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

వరంగల్ సిటీ, మేజర్ న్యూస్, వరంగల్ నగర అభివృద్ధిపై నిన్న జరిగిన బీఆర్ఎస్ సభలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందించిన నిధులు, పథకాలను తామే ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని మండిపడ్డారు. నిన్నటి సభలో కేటీఆర్ తెరపై చూపించిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగాయని ఆయన  పేర్కొన్నారు. వరంగల్ నగర సుందరీకరణలో భాగంగా నిర్మించిన భద్రకాళి బండ్, ఆధునిక వైకుంఠ ధామాలు, సైకిల్ ట్రాక్, రీజనల్ లైబ్రరీ ఆధునీకరణ, మరియు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం అప్‌గ్రేడేషన్ పనులన్నీ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్, అమృత్, హృదయ్ పథకాల కింద ఇచ్చిన వందల కోట్ల రూపాయల నిధులతోనే పూర్తయ్యాయని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేస్తే, వాటికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించి, కమీషన్ల కక్కుర్తితో వరంగల్ అభివృద్ధిని అటకెక్కించిందే తప్ప సొంతంగా చేసింది ఏమీ లేదని గంట రవికుమార్ విమర్శించారు. మరోవైపు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కూడా వరంగల్ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి రెండు వైపులా అని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నది కేవలం భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాత్రమేనని గంట రవికుమార్ స్పష్టం చేశారు. అబద్ధపు ప్రచారాలతో ఓరుగల్లు ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్‌ను ఆయన హెచ్చరించారు.

రిపోర్టర్; సంతోష్ కే, వరంగల్ సిటీ, వరంగల్ జిల్లా