ఖని' లో దారుణం.. సింగరేణి కార్మికుడు హత్య!
'
సూర్య-గోదావరిఖని:???? పాత కక్షలే కారణమా?
???? అర్ధరాత్రి బయటకు పిలిపించి కత్తులతో దాడి
???? సప్తగిరి కాలనీ శివాలయం సమీపంలో ఘాతుకం???? నలుగురు గుర్తుతెలియని వ్యక్తులపై అనుమానాలు???? సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు…గంజాయి మత్తు.. నేరాలకు అడ్డుకట్ట ఎప్పుడు?….
గోదావరిఖని పట్టణంలో సింగరేణి కార్మికుడు అట్ల రాజశేఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి సప్తగిరి కాలనీలోని శివాలయం వద్దకు అతడిని పిలిపించి నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు ప్రాథమిక సమాచారం.
మరోవైపు పట్టణంలో గంజాయి అక్రమ విక్రయాలు, వినియోగం పెరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాత్రివేళల్లో గంజాయి విక్రయాలపై పోలీసుల నిఘా కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రజల ప్రశ్న ఒక్కటే.. గంజాయి మహమ్మారికి అడ్డుకట్ట ఎప్పుడు? ప్రజలకు భద్రత కల్పించే బాధ్యత ఎవరిది?
హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి. పట్టణంలో రాత్రివేళ పోలీసు గస్తీని ముమ్మరం చేయాలి.
--------