బొడ్రాయి నిర్మాణానికి లక్ష విరాళం-ఔదార్యం చాటుకున్న అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి
గీసుగొండ, మేజర్ న్యూస్, మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గట్టుకింద పల్లెలో బొడ్రాయి నిర్మాణం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకురాలు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి రూ.1లక్ష విరాళంగా అందించారు.ఈ మేరకు హైదరాబాద్‌లో గీసుకొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్ కు లక్ష రూపాయల నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్, మనుగొండ గ్రామ సర్పంచ్ పేర్ల శ్రవణ్, మనుగొండ గ్రామ వార్డు సభ్యులు యాగోని రజనీకాంత్, తుప్పరి ఉదయ్, చిరంజీవి, బిక్షపతి, పాకనాటి మధు, సాయిలి మధు, బోయ అశోక్, దౌడు రాజేష్, బోడ హరి నాయక్, బాదావత్ లాల్ సింగ్, సాయిలి నరేందర్‌తో పాటు ఉపసర్పంచ్ పులి సూరయ్య, పులి కోర్నేలు, పులి సుధాకర్, పులి రవి, చిలుపురి రవి, పులి రవీందర్, పులి శంకర్, పులి మల్లయ్య, పులి రాజేష్, పులి రాజు, పులి చిరంజీవి, పులి రమేష్, పులి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: విష్ణు చందర్, గీసుకొండ, వరంగల్ జిల్లా