BREAKING
శలాకకు ఉషశ్రీ శతజయంతి పురస్కారం శతజయంతి లోగో ఆవిష్కరణ సభలో రమణాచారి ప్రకటన మున్సిపల్ వైస్ చైర్మన్‌గా కొలగాని రాము.. నేడు ప్రమాణ స్వీకారం తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదల! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 8 గంటల్లో సర్వదర్శనం 'ఎల్లమ్మ'లో దేవిశ్రీ నటన చూసి షాక్ అవుతారు: వేణు 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రపై శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు జై శంభవేశ్వరా..కథ 'కిరికిరి' సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు గతంలో ఎంపీటీసీగా గెలుపు.. ఇప్పుడు సర్పంచ్ బరిలో మారుతి రెడ్డి! శర్వానంద్ 'భోగి' ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ బంగారం, వెండి ధరలు డౌన్.. సోమవారం తులం ఎంతంటే? ఇఫీ 2026లో 'రామాయణ' ప్రదర్శన.. దేశానికి గౌరవం: నితీష్ తివారీ 'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్.. నవంబర్ 27న రిలీజ్ 'వృషకర్మ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 25న గ్రాండ్ ఈవెంట్ 15 దేశాల్లో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా 'బాల 369': విజయ్ కుమార్ కలివరపు

తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదల!

Select Suryaa Now
తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల విడుదల!

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్య గమనిక జారీ చేసింది. వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల కోటాను టీటీడీ ఇవాళ (సోమవారం, నవంబర్ 23) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

నేడు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మధ్యాహ్నం 3 గంటలకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ఇక భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన (SED) టికెట్ల కోటాను రేపు (మంగళవారం, నవంబర్ 24) ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (ttdevasthanams.ap.gov.in) లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.